మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ కావడం ఖాయం : ఈటల రాజేందర్

-

మే 13వ తేదీన  లోక్‌సభ ఎన్నికలు ఉన్నాయని మీ అందరికీ తెలుసు.. మళ్లీ మూడవసారి ముచ్చటగా నరేంద్రమోదీ  ప్రధాన మంత్రిగా ఎన్నుకోవాలని ప్రజలు ఉత్సాహంగా ఉన్నారని ఈటల రాజేందర్ తెలిపారు. కుత్బుల్లాపూర్, జగద్గిరిగుట్టలో ఈటల రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  బీఆర్‌ఎస్ పార్టీ సంగతి మీకు తెలిసిందే. ప్రజలు బీఆర్‌ఎస్‌ను గద్దె దింపాలనే కోరికతోనే కేసీఆర్‌ను ఓడించారు. ఇప్పుడు ఈ లోక్‌సభ ఎన్నికలలో వారికి ఓట్లు వేస్తే అవి వృధా అవుతాయి. వారి ఎంపీలు లోక్‌సభకు వెళ్లి ఏమీ చేయలేరు.

ఇక కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఒడ్డెక్కేదాకా ఓడ మల్లప్ప ఒడ్డెక్కినాక బోడమల్లప్ప విధంగా ఏ రకమైన ఎన్నికలు హామీలు అమలు చేయలేదు. ప్రతీ మహిళకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. అది ఇప్పటి వరకూ జరగలేదు. చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని చెప్పారు. వృద్ధులకు రూ. 4000 పెన్షన్ ఇస్తామని చెప్పారు. వికలాంగులకు రూ. 6000 ఇస్తామన్నారు. మహిళా సంఘాలకు రూ. 10 లక్షలు రుణం ఇస్తామన్నారు. కూలీలకు, ఆటో కార్మికులకు పెన్షన్లు ఇస్తామన్నారు. వీటిలో ఏదీ నెరవేర్చలేదు. మరి అలాంటి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు మళ్లీ ఎలా వేస్తారు.

రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే ఈహామీలు నెరవేర్చగలమని ఇప్పుడు చెప్తున్నారు రేవంత్ రెడ్డి. రాబోయే కాలంలో మల్కాజ్ గిరికి రోడ్లు కావాలన్నా, త్రాగునీరు, డ్రైనేజ్ సిస్టం, ఇండస్ట్రియల్ కారిడార్, రప్పించడానికి కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను. మీ పిల్లలకు సర్కార్ నౌకరీలు కావాలంటే బీజేపీ పార్టీకి కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాను.

Read more RELATED
Recommended to you

Exit mobile version