5 రాష్ట్రాల్లో రూ. 1760 కోట్లు పట్టివేత: ఈసీ

-

గత కొన్ని రోజుల క్రితం కేంద్ర ఎన్నికల సంఘం మొత్తం అయిదు రాష్ట్రాలలో ఎన్నికలు జరిపించడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఇప్పటికే మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ మరియు మిజోరాం రాష్ట్రాలలో ఎన్నికలు పూర్తి అయ్యాయి. ఇక మరో అయిదు రోజుల్లో రాజస్థాన్ లో మరియు నవంబర్ 30న తెలంగాణాలో ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల సమయం కావడంతో కోడ్ అమలులో ఉంటుందన్న విషయం అన్ని రాజకీయ పార్టీలకు తెలుసు. ఈ సందర్భంగా ఈసీ ఒక కీలక విషయాన్ని ప్రకటించింది. ఈ ఎన్నికల కోడ్ లో భాగంగా అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన మొత్తం విలువను ప్రకటించింది. ఆ ప్రకారం చూస్తే రూ. 1760 కోట్లు విలువైన నగదు, మద్యం, డ్రగ్స్ మరియు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలియచేసింది ఈసీ.

ఇక 2018 లో జరిగిన ఎన్నికల్లో పట్టుబడిన మొత్తం కన్నా ఇది ఏడు రేట్లు ఎక్కువ కావడం విశేషం. కాగా 2018 లో జరిగిన ఎన్నికల సమయంలో పట్టుబడిన మొత్తం రూ. 239 .15 కోట్లు మాత్రమే.

Read more RELATED
Recommended to you

Latest news