ఈ మధ్య కాలంలో రాజకీయనాయకులు, అధికారులు, సెలబ్రీటీలు, పేదలు.. ఇలా ఎవ్వరూ వారు వీరు అని తేడా లేకుండా అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. తాజాగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శౌండిల్య తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బషీర్ బాగ్ పాత సీసీ కార్యాలయంలో ఉండగా ఆయన గుండెపోటుకు గురయ్యారు.
దీంతో వెంటనే ఆయనను హైదర్ గూడ అపోలో ఆసుపత్రికి అధికారులు తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ లను బదిలీ చేయగా ఈసీ సూచనల మేరకు సందీప్ శౌండిల్యను హైదరాబాద్ సీసీగా సీఎస్ శాంతి కుమారి నియమించారు.