రాజకీయ పార్టీలకి భారీ షాక్ ఇచ్చింది ఈసీ. వివరాలకు వెళ్తే ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలకు పెద్ద షాక్ ఇచ్చింది. ఇప్పటివరకు రాజకీయ పార్టీలు స్వలాభం కోసం చిన్న పిల్లలను పార్టీ ప్రచారలో వాడుకున్నారు అయితే ఇకపై ఎలా చేయడానికి వీలు లేదని ఎన్నికల సంఘం చెప్పింది ఎన్నికలకు సంబంధించిన పనులు ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో చిన్న పిల్లల్ని చేర్చకుండా చూడాలని రాజకీయ పార్టీలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయంపై అన్ని రాజకీయ పార్టీలకి ప్రత్యేక సర్కిలర్ ని ఈసీఐ జారీ చేసింది.
ఇకపై ఈసీఐ ఆదేశించిన తీరుగా ఎన్నికల అభ్యర్థులు జాగ్రత్తలు తీసుకోవాలని రాజకీయ పార్టీలు అభ్యర్థులు రాజకీయ ప్రచారాల్లో ఎన్నికల ర్యాలీలో పిల్లల్ని ఏ రూపంలో కూడా వినియోగించకూడదని చెప్పింది. పోస్టర్లు కరపత్రాలు పంపిణీ నినాదాలు ప్రచార ర్యాలీలు ఎన్నికల సమావేశంలో పాల్గొనడం కోసం ఏ రూపంలో కూడా పిల్లల్ని ఉపయోగించకూడదని చెప్పింది. పిల్లల వాడకం పట్ల జీరో టోలరెన్స్ అనే సందేశాన్ని ఇస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలను జారీ చేసింది.