వైఎస్సార్ సీపీ నేత, విశాఖపట్నం మాజీ పార్లమెంట్ సభ్యుడు ఎంవీవీ సత్యానారాయణ ఇంట్లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయన ఇళ్లు, కార్యాలయాలతో పాటు ఆడిటర్ వెంకటేశ్వర రావు, గద్దె బ్రహ్మాజీ నివాసాలు, కార్యాలయాల్లోనూ ఈడీ సోదాలు జరుపుతోంది. మొత్తం ఐదు చోట్ల ఒకేసారి ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. వైజాగ్ పరిధిలో నమోదైన కేసుల ఆధారంగా ఈడీ రంగంలోకి దిగినట్లు సమాచారం.
ఇటీవల మాజీ ఎంపీ ఎంవీవీపై మోసం, కుట్ర ఫోర్జరీ వంటి ఆరోపణల కేసులు నమోదయ్యాయి.దీంతో ఆయన ముందుగానే హైకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నారు. భూకబ్జా ఆరోపణలు, హయగ్రీవ భూముల వివాదంలో ఆయనపై ప్రధానంగా కేసులు నమోదయ్యాయి. ఈయన బిల్డర్ కూడా. 2008లో ప్రభుత్వం నుంచి 12.51 ఎకరాలను అప్పటి మార్కెట్ రేటు ప్రకారం కొన్న హయగ్రీవ్ నిర్మాణ సంస్థ అందదులో వృద్ధాశ్రమం, అనాధశ్రమం నిర్మిస్తామని కొన్నారు. రీసెంట్‌గా ఈ స్థలాన్ని లాభాలకు అమ్ముకోవడానికి ప్రయత్నించారనే ఆరోపణలతో కేసు నమోదైంది.