ఎడిట్ నోట్: బీజేపీ ‘బాబు’.!

-

ఎప్పుడైతే బీజేపీ నుంచి బయటకొచ్చారో అప్పటినుంచి టి‌డి‌పి అధినేత చంద్రబాబుకు రాజకీయంగా ఏది కలిసిరావడం లేదనే చెప్పాలి. 2018లో బి‌జే‌పి పొత్తు నుంచి బయటకొచ్చిన బాబుకు తెలంగాణలో ఘోర పరాభవం ఎదురైంది. ఇక అప్పటివరకు అధికారంలో ఉన్న ఏపీలో 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. అక్కడ నుంచి రాజకీయంగా కోలుకోలేని పరిస్తితి. పైగా కేంద్రంలో బి‌జే‌పి మళ్ళీ అధికారంలో వచ్చింది..ఇటు రాష్ట్రంలో జగన్‌కు పరోక్షంగా అండగా నిలుస్తూ వస్తుంది.

దీంతో రాజకీయంగా బాబుకు బలపడలేని పరిస్తితి. ఈ క్రమంలోనే మళ్ళీ బి‌జే‌పికి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తూనే వచ్చారు. ఎక్కడ కూడా బి‌జే‌పి బాబుకు అవకాశం ఇవ్వలేదు. మళ్ళీ బాబుతో కలిసే ప్రసక్తి లేదని చెప్పింది. ఇక నెక్స్ట్ ఎలాగైనా టి‌డి‌పి గెలవాలి..లేదంటే టి‌డి‌పి మనుగడకే ప్రమాదం. ఈ నేపథ్యంలో బాబు, పవన్‌ని కలుపుకున్నారు. ఇక కేంద్రంలో అధికారంలో బి‌జే‌పి సపోర్ట్ ఉంటే రాజకీయంగా తిరుగుండదని భావిస్తున్నారు. ఇదే క్రమంలో పవన్ ద్వారా బి‌జే‌పిని దగ్గర చేసుకునే ప్రయత్నాలు చేశారు.

అవి వర్కౌట్ అవ్వలేదు. ఈ క్రమంలో అనూహ్యంగా బాబు..ఢిల్లీకి వెళ్ళి బి‌జేపి పెద్దలని కలవడం సంచలనంగా మారింది. ఇటీవలే పలుమార్లు జగన్ ఢిల్లీకి వెళ్ళి కేంద్రం పెద్దలని కలిసి వచ్చారు. అదే తరుణంలో బాబు ఢిల్లీకి వెళ్ళి..అమిత్ షా, జే‌పి నడ్డాలతో భేటీ అయ్యారు. అలాగే మోదీతో కూడా భేటీ అవుతున్నారు.

దీంతో బి‌జే‌పిని పొత్తుకు ఒప్పించడానికే బాబు ఢిల్లీకి వెళ్లారని అంటున్నారు. అయితే వారు ఏం మాట్లాడుకున్నారో ఎవరికి తెలియదు. కానీ ఎవరి ఊహాగానాలు వారికి ఉన్నాయి. బాబు…బి‌జే‌పికి ఆఫర్ ఇచ్చారని, పొత్తు పెట్టుకోవాలని కోరారని అంటున్నారు. అదే సమయంలో ఎమ్మెల్యే సీట్లు వదిలేస్తే..8 ఎంపీ సీట్లు ఇవ్వాలని బి‌జే‌పి ప్రతిపాదన పెట్టిందని అంటున్నారు. కానీ అన్నీ సీట్లు ఇస్తే తమకే నష్టమని బాబు భావిస్తున్నారని, బి‌జే‌పికి ఏపీ ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని, ఇలాంటి పరిస్తితిలో ఓట్లు బదిలీ కావని చూస్తున్నారు.

అయితే మరో కథనం ప్రకారం బి‌జే‌పి..టి‌డి‌పిని ఎన్డీయేలోకి ఆహ్వానించిందని, తెలంగాణలో సహకారంతో పాటు, ఏపీలో పొత్తు పెట్టుకోవాలని అనుకుంటుందని చెబుతున్నారు. కానీ ఈ రెండిటిల్లో ఏది వాస్తవం అనేది తెలియదు. ఏమైనా ఉంటే బాబు మాత్రమే చెప్పాలి. చూడాలి మరి బి‌జే‌పితో బాబు కలుస్తారో లేదో.

Read more RELATED
Recommended to you

Latest news