‘పౌరసత్వ సవరణ చట్టం-2019’ ఎఫెక్ట్.. కోమటిరెడ్డికి నిరసన సెగ

-

త్వరలోనే లోక్సభ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వివాదస్పదమైన ‘పౌరసత్వ సవరణ చట్టం-2019’ ను అమల్లోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు దీన్ని వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ నిరనస సెగ తగిలింది. దీన్ని వ్యతిరేకిస్తున్న ఎంఐఎం నేతలు.. తాజాగా నల్గొండలో CAAపై తన వైఖరి చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని డిమాండ్ చేశారు. దీంతో ఆయన ఎంఐఎంకు సమాధానం చెప్పాల్సిన అవసరం తమకు లేదని అన్నారు. ఈక్రమంలోనే అక్కడ వాగ్వాదం నెలకొంది. దీంతో పోలీసులు కలగజేసుకుని ఎంఐఎం నాయకులను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు.

ఇదిలా ఉంటే….పౌరసత్వ సవరణ చట్టం-2019 కోసం త్వరలో అందుబాటులోకి తెచ్చే పోర్టల్లో పౌరసత్వం కోసం ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని కేంద్రం బాధితులను కోరింది.ఈ చట్టం 2014 డిసెంబరు 31 కంటే ముందు ఆఫ్ఘనిస్తాన్ ,పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి మన దేశానికి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, పార్సీలకు ఇవి వర్తిస్తాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news