ఈటల రాజేందర్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే టీఆర్ ఎస్‌లో ఉన్న అసంతృప్త నేతలతో ఆయన చర్చించారు. అలాగే కొందరు కాంగ్రెస్ నేతలతో కూడా మాట్లాడారు. కానీ కాంగ్రెస్ రాష్ట్ర అగ్ర నేతలను ఆయన కలువలేదు. కానీ బీజేపీ అగ్ర నేతలతో ఆయన భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది.
మంగళవారం కిషన్‌రెడ్డి, భూపేందర్ యాదవ్, బండి సంజయ్‌తో ఈటల హైదరాబాద్ శివారులో రహస్యంగా భేటీ అయిన విషయం తెలిసిందే. అయితే రెండో రోజు బుధవారం కూడా బీజేపీ అధిష్టానంతో ఆయన రహస్య మంతనాలు జరిపినట్టు సమాచారం.
అత్యంత రహస్యంగా జరిగిన ఈ భేటీలో ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి కూడా ఉన్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ఈటలతో పాటు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ తులా ఉమా, ఇంకా కొందరు ఉద్యమ కారులను బీజేపీలోకి ఆహ్వానించినట్టు తెలుస్తోంది. అయితే వారందరిని చేర్పించే బాధ్యత ఈటలదే అని వారు హామీ తీసుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ అధిష్టానం ఈటల భవిష్యత్, పదవులపై హామీ ఇస్తే చేరేందుకు సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఆయన ఉప ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గానే పోటీ చేస్తారని సమాచారం. మరి దీనిపై స్పష్టత రావాలంటే వెయిట్ చేయాల్సిందే.