బిహార్‌ పోలీసుల వీరంగం..ఓ వృద్ధుడి పట్టుకుని చితక్కొట్టారు..వీడియో వైరల్

-

ఓ వృద్ధున్ని మహిళా పోలీసులు చితక్కొట్టిన సంఘటన తాజాగా బీహార్‌ లో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే, బీహార్, కైమూర్ కు చెందిన వృద్ధుడు స్థానికంగా ఉండే ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పని చేస్తున్నాడు. ఆయన కొద్ది రోజుల క్రితం తన సైకిల్ మీద రోడ్డుపై వెళ్తున్నాడు.ఈ నేపథ్యంలో అతడు రోడ్డుపై సైకిల్ మీద నుంచి కింద పడ్డాడు. 70 ఏళ్ల వయసు కావటంతో ఆయన పైకి లేవటానికి ఇబ్బందులు పడసాగాడు.

అతి కష్టం మీద పైకి లేచి నిలబడ్డాడు. ఆ ఇద్దరు మహిళా పోలీసులు ఆయన దగ్గరకు వచ్చారు. ఆయనతో గొడవ పెట్టుకున్నారు.తమ వద్ద ఉన్న కర్రలతో ఆయన్ని కొట్టడం ప్రారంభించారు. ఆయన కొట్టొద్దని ఎంత బతిమాలిన వాళ్ళు వినిపించుకోలేదు. ఒకరి తర్వాత ఒకరు దాడి చేశారు. అయితే ఈ దాడిని రోడ్డుపై ఉన్న వారందరూ చూస్తూ నిలబడ్డారు కానీ ఆపడానికి ఏమాత్రం ప్రయత్నించలేదు. ఆ దృశ్యాలను అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీశాడు. ఈ వీడియోను స్వాతి మణివాల్ అనే యువతీ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రస్తుత మీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news