హుస్నాబాద్ నుంచే  ప్రచారం షురూ…

-

తెరాస ఎన్నికల ప్రచారాన్ని హుస్నాబాద్ నుంచి పార్టీ అధినేత కేసీఆర్ ప్రారంభించనున్నారు. ‘ప్రజా ఆశీర్వాదం’ పేరుతో శంఖారావం ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు శుక్రవారం మధ్యాహ్నం జరగనున్న సభ ఏర్పాట్లను పరిశీలించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలోనూ కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని ఈ ప్రాంతం నుంచే ప్రారంభించినట్లు గుర్తు చేశారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా  కోనాయిపల్లిలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించి సభాస్థలికి చేరుకోనున్నట్లు ఆయన తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news