తెలంగాణాలో మరో రెండు రోజులు మాత్రం ఎన్నికలకు సమయం ఉంది, అన్ని పార్టీలు తీవ్ర ఒత్తిడిలో ఉన్నా కూడా చాలా హుషారుగా ప్రచారంలో పాల్గొంటూ ఓటర్లను మెప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ రాష్ట్రంలో తమ తమ పార్టీలను గెలిపించుకోవడానికి బీజేపీ, కాంగ్రెస్ లకు మద్దతుగా కేంద్రం మరియు ఇతర రాష్ట్రాల నుండి నాయకులు వస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడినందుకు కర్ణాటక ప్రభుత్వంపై ఎన్నికల సంఘం ఆగ్రహాన్ని ప్రదర్శించింది. తెలంగాణాలో ఎటువంటి అనుమతి లేకుండా ప్రకటనలు ఇవ్వడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ కర్ణాటక రాష్ట్ర సీఎస్ కు లేఖను రాసింది. ఈ లేఖపై రేపు సాయంత్రం 5 గంటల లోపు తగు వివరణ ఇవ్వాలంటూ ఆదేశించింది.
ఇకపై ఇలాంటి ప్రకటనలను ఆపాలంటూ తెలపడం జరిగింది. ఈ ప్రకటనలపై బాధ్యులు అయిన వారి పైన ఎందుకు చర్యలు తీసుకోకూడదే వివరణ ఇవ్వాలంటూ కోరింది ఎన్నికల సంఘం. కాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం ఏ పార్టీకి దక్కుతుందో తేలియాలనంటే డిసెంబర్ 3 వరకు వెయిట్ చేయక తప్పదు.