తెలంగాణ శాసనసభ ఎన్నికల సమరం తుది ఘట్టానికి చేరుకుంది. ఎన్నికల ప్రచారానికి ఇవాళ ఒక్కరోజే గడువు ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని మరింత ఉద్ధృతం చేస్తున్నాయి. ఇందులో అధికార బీఆర్ఎస్ పార్టీ ఇంకాస్త ముందంజలో ఉంది. బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ రోజుకు నాలుగు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.

ఇందులో భాగంగా ఇవాళ రెండు నియోజకవర్గాల్లో జరగనున్న ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్ పాల్గొననున్నారు. ఇప్పటివరకు 94 సభలకు ఆయన హాజరయ్యారు. అక్టోబర్ 15న హుస్నాబాద్ నుంచి కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలకు శ్రీకారం చుట్టారు. ఇక ఇవాళ గజ్వేల్ మరియు వరంగల్ జిల్లాలో ప్రచారం చేశారు సీఎం కేసీఆర్. ఇవాళ వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలకు ఉమ్మడిగా జరగనున్న సభతోపాటు గజ్వేల్ సభలో కేసీఆర్ పాల్గొంటారు.