కరోనా కారణంగా చాలా పనులకి ఆటంకం ఏర్పడింది. ప్రభుత్వ వ్యవస్థలు స్తంభించిపోవడంతో ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. ప్రపంచాన్నే గడగడలాడించిన కరోనా, వ్యాక్సిన్ వచ్చిన తర్వాత కూడా తన ప్రభావాన్ని చూపిస్తూనే ఉంది. కరోనా వల్ల ఇబ్బందిగా మారిన వాటిల్లో ఎన్నికలు కూడా ఒకటి. ప్రస్తుతం కరోనా ఉధృతి మునుపటి లేదు కాబట్టి ఎన్నికలకు ఎలక్షన్ కమీషన్ సిద్ధం అవుతుంది. మొన్నటికి మొన్న బీహార్ లో మూడు దశలుగా ఎన్నికలు జరిగాయి.
తాజాగా, మరో ఐదు రాష్ట్రాల్లో ఎలక్షన్లు జరగనున్నాయి. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి, అస్సాంలలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఎన్నికల షెడ్యూలుని విడుదల చేయనున్నారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన భవనంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూలు విడుదల కాబడుతుంది. ఏప్రిల్, మే నెలలో ఈ షెడ్యూలు ఉండనుందని తెలుస్తుంది.