ప్రశాంతంగా ముగిసిన పోలింగ్

-


తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అక్కడక్కడ చిన్నచిన్న గొడవలు మినహా అన్ని నియోజకవర్గాల్లో అనుకున్న సమయానికే పూర్తైంది. దీంతో 119 నియోజకవర్గాల్లో ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద వరుసలో ఉన్నవారు మాత్రం ఇంకా తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 32,815 పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్ జరిగింది. రాష్ట్రంలోని 13 సమస్యాత్మక నియోజకవర్గాల్లో సాయంత్రం 4గంటలకే పోలింగ్ ని ముగించారు.

 పోలింగ్ విషయానికొస్తే పట్టణాల్లో ఓటింగ్ కాస్త మందకొడిగా సాగగా.. గ్రామీణ ప్రాంతాల్లో కాస్త పెరిగింది. పట్టణాల్లో ఉండే ప్రజలు ఊర్లకు వెళ్లి మరీ ఓట్లు వేసి వచ్చారు. అర్బన్ ఓటర్లు ప్రతి సారి మాదిరిగానే ఈ ఏడాది తమ బద్దకాన్ని కొనసాగించారు. ఈ నెల 11న ఎన్నికల ఫలితాలు విడుదల కానుండటంతో.. పార్టీల ఫోకస్ మొత్తం అటువైపుగా మళ్లింది. ఎవరికి వారే గెలుపుపై ధీమాతో కనిపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version