5 రాష్ట్రాల ఎన్నికల్లో దాదాపుగా భారతీయ జనతా పార్టీ కనుమరుగు అయిపోయింది. అధికారంలో ఉన్న అసోం లో చిన్న కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో మాత్రమే బిజెపి విజయం సాధిస్తుంది. ఈ రెండు కూడా చిన్న రాష్ట్రాలే. దీనితో బిజెపి ప్రభావం ఈ ఎన్నికల్లో కనపడలేదు అనే చెప్పాలి. పశ్చిమ బెంగాల్ లో 93 స్థానాల్లో బిజెపి విజయం సాధించే అవకాశం కనపడుతుంది. మమత 200 స్థానాలకు పైగా గెలిచే అవకాశం ఉండవచ్చు.
తమిళనాడులో స్టాలిన్ ముఖ్యమంత్రి కావడం దాదాపుగా ఖరారు అయింది. కేరళలో వరుసగా రెండో సారి విజయన్ ఎల్దిఎఫ్ నుంచి సిఎం అవుతున్నారు. పుదుచ్చేరిలో బిజెపి లీడింగ్ లో ఉంది. మమత బెనర్జీకి బిజెపికి మధ్య బెంగాల్ లో 100 స్థానాల తేడా ఉంది. దీనితో మమత విజయం సాధించడం దాదాపుగా ఖాయం అయింది.