వారం రోజుల్లో ఎన్నికలు.. ఇప్పటివరకు బీజేపీకి మేనిఫెస్టోనే లేదు : సామ రామ్మోహన్ రెడ్డి

-

సామ రామ్మోహన్ రెడ్డి బీజేపి పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు అన్ని మంచి చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన మోడీ సర్కార్ 10 సంవత్సరాలు చెవిలో పువ్వులు పెట్టుడు తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదు అని విమర్శించారు. గత పది సంవత్సరాలలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. వృద్ధులకి, వికలాంగులకి, వితంతువులకి ఒక్క రూపాయి కూడా పెంచలేదు అని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

ఎన్నికల ముందు అచ్చే దిన్ అని చెప్పి ధరలను నియంత్రిస్తామని చెప్పారు. అవినీతిని నిర్మూలిస్తామని చెప్పారు. నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తామని చెప్పారు. డాలర్ తో రూపాయిని పోటీకి తీసుకొస్తామని చెప్పారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. కానీ ఏ ఒక్క హామీని కూడా బీజేపీ నిలబెట్టుకోలేదు అని మండిపడ్డారు.వారం రోజుల్లో ఎన్నికలు ప్రారంభం అవుతున్నాయి. ఇప్పటివరకు బీజేపీకి మేనిఫెస్టోనే గతిలేదు. వారు మా మేనిఫెస్టో పై విమర్శలు చేస్తున్నారు అని ధ్వజమెత్తారు. అందరికీ ఉద్యోగాలు ఇస్తాం. పెట్రోల్, డీజిల్ రెట్లు తగ్గిస్తాం. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని 2014లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? 2022 కల్లా ప్రతి పేదోడికి మోడీ కట్టిన ఇల్లు వస్తుందని చెప్పారు. మోదీ కట్టిన ఇంట్లో బ్రతికే ఒక్క పేద కుటుంబాన్ని అయినా చూపిస్తారా? అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news