బీజేపీ, కాంగ్రెస్ చీకటి ఒప్పందాలు చేసుకున్నాయి : హరీష్ రావు

-

మాజీ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ పార్టీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు..బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్‌కు మద్దతుగా కరీంనగర్‌లో రోడ్ షోలో మాజీ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ…కేసీఆర్ రైతుల కోసం ప్రశ్నించిండు అని అన్నారు.రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారుపై తుపాకీ ఎక్కుపెట్టిండు అని,ఎన్నడైనా జై తెలంగాణ అన్నాడా? ఆ పనిచేయని నువ్వు కనీసం అమరవీరుల స్తూపం వద్ద పువ్వులైనా పెట్టి నివాళులు అర్పించు అని సూచించారు.

బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అని అసెంబ్లీ ఎన్నికల్లో దుష్ప్రచారం చేశారు. కుమ్మక్కైంది బీజేపీ, కాంగ్రెసే అని బడే భాయ్, ఛోటే భాయ్ ఒక్కటయ్యారు అని అన్నారు.కరీంనగర్‌లో కాంగ్రెస్ ఇంతవరకు ఎంపీ అభ్యర్థిని ప్రకటించలేదు అని విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్ చీకటి ఒప్పందాలు చేసుకున్నాయి.. చాలా చోట్ల కాంగ్రెస్ బలహీనమైన అభ్యర్థులను బరిలో దింపుతోంది అని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news