ఈరోజుల్లో ఆన్లైన్ మోసాలు బాగా విపరీతంగా పెరిగిపోయాయి. చాలామంది ఫోన్లకి తప్పుడు మెసేజ్లు ని పంపిస్తూ అందరినీ మోసం చేస్తున్నారు. మోసగాళ్ల వలలో చిక్కుకుంటే కచ్చితంగా అకౌంట్ సున్నా అయిపోతుంది టెక్నాలజీ రోజురోజుకి పెరుగుతుండడంతో మోసాలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. లేనిపోని లింకుల మీద క్లిక్ చేస్తే కచ్చితంగా అకౌంట్ జీరో అయిపోవడం పక్కా. తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. మరి ఇంతకీ అది నిజమా కాదా అసలు విషయం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం..
మొబైల్ లో కరెంట్ బిల్లు బకాయి ఉందని ఆన్లైన్ ద్వారా సందేశాలు పంపి ప్రజల్ని మోసం చేస్తున్నారు ఇటువంటి మెసేజ్లు నిజమని అనవసరంగా నమ్మితే నష్టపోవాల్సి ఉంటుంది. BESCOM బెస్కామ్ పేరుతో సైబర్ నేరగాళ్లు ప్రజలకి మెసేజ్లు పంపిస్తున్నారు. మోసానికి పాల్పడుతున్నారు. విద్యుత్ సంస్థ పేరుతో మోసగాళ్లు మెసేజ్లు ని పంపి ఫోన్ చేయాలని సూచించడం లేనిపక్షంలో డిస్కనెక్ట్ చేస్తామని హెచ్చరిస్తున్నారు.
”ప్రియమైన కస్టమర్ మీ మునుపటి నెల బిల్లును అప్‌డేట్ చేయలేదు. ఈ రోజు రాత్రి 9.30 గంటలకు విద్యుత్ కార్యాలయం ద్వారా విద్యుత్ కనెక్షన్ డిస్‌కనెక్ట్ చేయబడుతుంది. దయచేసి వెంటనే అధికారిని సంప్రదించండి” అని ఈ విధంగా ఫోన్లకి మెసేజ్ వస్తోంది. అయితే ఈ సందేశం ఏమీ అధికారుల నుండి రావడం లేదు మోసగాళ్ళే ఈ విధంగా మెసేజ్లు పంపి మోసం చేస్తున్నారు చాలామంది ఇది నిజం అనుకుని విద్యుత్ డిస్కనెక్ట్ అవుతుందని భయపడి వ్యక్తిగత వివరాలతో పాటుగా బ్యాంకు వివరాలు కూడా ఇచ్చేస్తున్నారు.
ఇలా ఫోన్ చేయడం వలన వారి అకౌంట్లో ఉన్న డబ్బులు అన్ని కూడా ఖాళీ అయిపోతున్నాయి బెస్కో ఏ నెంబర్ నుండి కూడా వినియోగదారులకి మెసేజ్లు పంపడం లేదు. ఓటిపి పాస్వర్డ్ చెప్పాలని అడగదు కూడా. కాబట్టి ఇలాంటి మెసేజ్లతో జాగ్రత్తగా ఉండండి లేకపోతే అనవసరంగా ఇబ్బందులు పడాలి. సోషల్ మీడియాలో ఈరోజుల్లో ఉద్యోగాల పేరుతో స్కీముల పేరుతో స్కాములకి పాల్పడుతున్నారు అటువంటి స్కాముల్లో చిక్కారంటే ఎంతగానో నష్టపోవాలి జాగ్రత్తగా ఉండండి.