చిత్తూరులో ఏనుగు భీభత్సం.. భార్యభర్తలు మృతి

-

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో దారుణం ఘటన చోటుచేసుకుంది. గుడిపాల మండలం 190 రామాపురంలో ఒంటరి ఏనుగు ఓ బీభత్సాన్నే సృష్టించింది. బ్ ఏనుగు ఒక్కసారిగా దాడి చేయడంతో భార్యాభర్తలు ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను రామాపురం హరిజనవాడకు చెందిన దంపతులు వెంకటేష్ సెల్విగా గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అటవీశాఖ అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు.

ఉన్నట్టుండి భార్యాభర్తలిద్దరూ అకస్మాత్తుగా మరణించడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చిత్తూరు జిల్లాలో అడవి ఏనుగులు వరుస దాడులు ఈ మధ్యకాలంలో ఎక్కువగా కొనసాగుతున్నాయి. ఇటీవల కుప్పం సమీపంలో కూడా అడవి ఏనుగులు దాడి చేసిన విషయం అందరికీ తెలిసిందే. దీంతో సమీప ప్రాంతంలో ఉన్న ప్రజలు కాస్త భయాందోళనకు గురవుతున్నారు. బయటికి వెళ్లేందుకు జంకుతున్నారు. ఎటు నుంచి ఏనుగు వస్తుందో అనే భయంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బయటికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. అటవీ అధికారులు స్పందించి ఏనుగుల దాడిని అరికట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news