చిత్తూరు జిల్లాలో వరుస ఏనుగుల దాడులు కలకలం రేపుతున్నాయి. వాటి దాడుల్లో రైతులు మృత్యువాత పడుతున్నారు, భారీగా పంటలకు ఆస్తి నష్టం కలుగుతోంది. శాంతిపురం మండలం సి. బండపల్లి సమీపంలోని రాళ్లపల్లి వద్ద ఒంటరి ఏనుగు దాడిలో తాజాగా ఒక మహిళ మృతి చెందగా ఇప్పుడు గుడుపల్లి మండలం చింతరపాళ్యం గ్రామం వద్ద రైతు నారాయణప్ప పై ఒంటరి ఏనుగు దాడి చేసింది.
తీవ్రంగా గాయపడ్డ నారాయణ ను ఆసుపత్రికి తరలించారు. ఇక 2 రోజుల క్రితం కుప్పం మండలం పర్తిచేనులో నూ ఏనుగుల దాడిలో ఒక యువతి మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. అయితే ఈ విషయం మీద అటవీ అధికారులు పలు సూచనలు చేస్తున్నారు. వరుస ఏనుగుల దాడులతో, చేతికందిన పంటలు నష్టపోవడంతో రైతులు, గ్రామాల్లోని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఏనుగుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెబుతున్నారు.