బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు అనేక మలుపులు తిరుగుతోంది. అది ఇప్పుడు మరుగున పడి ఈ కేసులోనే వెలుగుచూసిన డ్రగ్స్ వ్యవహారంలో ఎన్ సీ బీ తన దర్యాప్తును వేగవంతం చేసింది. ఇప్పటికే ప్రముఖ హీరోయిన్లు రకుల్ ప్రీత్‌సింగ్, దీపిక పదుకొనె, సారా అలీఖాన్, శ్రద్దాకపూర్‌లను విచారించిన అధికారులు చేసిన పని ఇప్పుడు చర్చనీయంశంగా మారింది. నిన్న మొన్న వీరి విచారణ ముగిసిన అనంతరం నలుగురు నటీమణులు ఫోన్లను సీజ్ చేశారని తెలుస్తోంది.
నలుగురు హీరోయిన్లతో పాటు దీపిక మేనేజర్ కరిష్మా, జయ్ షాల ఫోన్ల్ ను కూడా సీజ్ చేసినట్లు ఎన్‌సీబీ ఈ ఉదయం వెల్లడించింది. శనివారం హీరోయిన్లు దీపికా పదుకొణె, సారా అలీఖాన్, శ్రద్ధాకపూర్‌లను సుదీర్ఘంగా వేర్వేరుగా ప్రశ్నించిన విషయం తెలిసిందే. అంతకుముందు రకుల్ ని కూడా ఎంసీబీ అధికారులు ప్రశ్నించారు. ఈ కేసులో నిన్న ధర్మా ప్రొడక్షన్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ క్షితిజ్ రవి ప్రసాద్‌ను అరెస్టు చేసింది. నిన్న దీపికని దాదాపుగా ఆరు గంటల పాటు విచారించింది బృందం. త్వరలోనే ఆమెను మరోసారి విచారించే అవకాశం ఉంది అని తెలుస్తుంది.