విజయనగరం జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. నిన్న రాత్రి పశువుల శాల పై ఏనుగులు దాడి చేశాయి. ఆవు దూడల పై ఏనుగు దాడి చేయడంతో అవి మరణించాయి. అర్ధరాత్రి వేళ ఏనుగులు ఊర్లోకి రావడం తో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఏనుగులను గ్రామాలకు దూరంగా తరలించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇంటి నుండి బయట అడుగుపెట్టాలంటే గ్రామస్తులు భయపడుతున్నారు.
ఎప్పుడు వచ్చి తమపై ఏనుగులు దాడి చేస్తాయో అని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫారెస్ట్ అధికారులు వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు ఈ విషయాన్ని నాయకుల దృష్టికి తీసుకెళ్లాలని కోరుతున్నారు. ఇది ఇలా ఉంటే గతంలో కూడా విజయనగరం జిల్లాలో ఏనుగుల గుంపులు హల్చల్ చేసిన ఘటనలు ఉన్నాయి. పంట పొలాల్లో రైతులపై దాడి చేసిన ఘటనలు చోటుచేసుకున్నాయి.