MAA elections : ప్రకాశ్ రాజ్ సంచలన నిర్ణయం

మా అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికల ఫలితాల అనంతరం ప్రకాష్ రాజ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని ప్రకటన చేశారు ప్రకాష్ రాజ్. ఈ మేరకు మీడియా సమావేశం నిర్వహించిన మాట్లాడుతూ.. ఎన్నికలు బాగా జరిగాయన్నారు. చైతన్యం తో ఎక్కువ మంది ఓట్లు వేశారనీ…మా ఎన్నికల్లో గెలిచిన వాళ్లకు అభినందనలు తెలిపారు ప్రకాశ్ రాజ్. ప్రాంతీయ వాదం, జాతీయ వాదం మధ్య ఎన్నికలు జరిగాయని..నా తల్లిదండ్రులు తెలుగు వాళ్ళు కాదనీ వెల్లడించారు. కళాకారుడుగా తనకు ఆత్మ గౌరవం ఉందనీ..అతిథి గా వచ్చాను.. అతిథిగా నే ఉంటానని స్పష్టం చేశారు.

21 ఏళ్ళుగా మా అసోసియేషన్ లో సభ్యుడిగా ఉన్నానని చెప్పారు ప్రకాష్ రాజ్. మా కుటుంబంలో అందరూ ఒక్కటే అనే పదం అబద్ధమని… ఓటమి జీర్ణించుకున్నా.. అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నానని స్పష్టం చేశారు. ఇకపై మాలో భాగస్వామ్యం గా ఉండలేననీ.. అసోసియేషన్ నుంచే బయటికి వచ్చా.. తెలుగు సినిమా నుంచి బయటకు రాలేదన్నారు. లోకల్ , నాన్ లోకల్ ఎజెండా ల మధ్య ఉండలేననీ తేల్చి చెప్పారు ప్రకాష్ రాజ్.