MAA Electons: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు గతంలో ఎన్నాడు లేని విధంగా జరిగాయి. ఈ ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ పై మంచు విష్ణు ఘన విజయం సాధించి, మా అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు. ఎంతో ఉత్కంఠగా ఎన్నికల ప్రచారం సాగిన, అంతా హడావుడి పోలింగ్ విషయంలో మాత్రం కనిపించలేదనే చెప్పాలి. 900 మంది ఉన్న మా అసోషియేన్‌లో 60 శాతం పోలింగ్ కూడా కాలేదు. దీని బట్టి మా ఎన్నికలపై సినీ నటులకు ఎంతటీ ఆసక్తి ఉందో తెలుస్తుంది. ఓటింగ్ కు మొహం చాటేశారు.
ఇక ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోలేని స్టార్ హీరోలు చాలా మంది ఉన్నారు. అసోసియేషన్ రాజకీయంలో కీలక పాత్ర పోషిస్తున్న వర్గాల వాళ్లున్నారు. అధ్యక్ష ఎన్నికల వ్యవహారంలో బాగా రచ్చ చేసిన నరేష్ ఓటు హక్కును వినియోగించుకోకపోవడం గమనార్హం. అసోసియేషన్ రాజకీయంలో కృష్ణ ఫ్యామిలీ కూడా చాలా కీలకం. కానీ ఆ ఫ్యామిలీ నుంచి ఓటు వేయడానికి ఎవరూ మందుకు రాలేదు. మహేష్ బాబు షూటింగుతో ఆయన విదేశంలో ఉండటం వల్ల ఓటు హక్కు వినియోగించుకోలేదు. ఇక ఈ గందరగోళానికి పూర్తిగా దూరంగా ఉండే.. ప్రభాస్ కూడా మా ఎన్నికల్లో తన ఓటును కాస్ట్ చేయలేదు.
ఇక దగ్గుబాటి, అక్కినేని ఫ్యామిలీలు కూడా పోలింగ్ కు చాలా దూరంగానే ఉంది. నాగార్జున ఓటేసినా.. నాగచౌతన్య, వెంకటేష్, రానాలు ఓటు హక్కును వినియోగించుకోలేదు. ఇక సుమంత్, సుశాంత్
ఎన్నికలకు చాలా దూరంగానే ఉన్నారు. ఇక మెగా ఫ్యామిలీ కూడా మా ఎన్నికల పోలింగ్ కూడా దూరంగానే ఉంది. నాగబాబు తనయుడు వరుణ్ తేజ్, కూతురు నిహారికలకు ఓటు హక్కును వినియోగించుకోలేదు.
మరోవైపు.. సాయిధరమ్ తేజ ఆస్పతిలో ఉండగా.. వైష్ణవ్ తేజ్ ఓటు హక్కు ఉన్న వినియోగించు కోలేదు. అలాగే అల్లు అర్జున్ కూడా తన ఓటును కాస్ట్ చేయలేదని తెలుస్తుంది. ఇక భవిష్యత్ రాజకీయాలు అనే వార్తల్లో నిలుస్తున్న ఎన్టీఆర్ ఈ ఎన్నికలను పట్టించుకోలేదు. నితిన్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకోలేదని తెలుస్తోంది.
ఇక , మాస్ మహారాజ్ రవితేజ, రౌడీ విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, రానా, అందాల తారా రకుల్ ప్రీత్ సింగ్, అనుష్క, త్రిష, హన్సిక, ఇలియానా, శర్వానంద్, సునీల్ తదితరులు ఓట్లు వేయలేదు. ఇతర రాష్ట్రాల్లో, షూటింగులో ఉండిపోయినందున పలువురు ఓట్లేయలేకపోగా.. మరికొందరు ఆసక్తి లేక.. వర్గాలకు అతీతంగా ఉండేందుకు ఓటింగ్ కు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.