ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇటు విజయవాడ, కాకినాడ జిల్లాల్లో భారీ వరదలు సంభవించిన విషయం తెలిసిందే. బుడమేరు, ఏలేరు కి గండ్లు పడిన విషయం తెలిసిందే. వీటి గండ్లను పూడ్చినప్పటికీ మళ్లీ పడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా కాకినాడ జిల్లాకు ఇప్పుడు మరో టెన్షన్ పట్టుకుంది. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో ఏలేరు కాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది.
అంతేకాదు వరద దాటికి మాకవరం మండలం రాచపల్లి వద్ద గండి పడింది. 10 అడుగుల మేర గట్టు తెగిపోయింది. దీంతో అండర్ టన్నెల్ నుంచి వరద నీరు స్థానిక గెడ్డలోకి వెళ్తుంది. ఈ విషయం తెలుసుకున్న అధికారులు గండి పడిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. గండి పూడ్చివేతపై చర్యలు చేపట్టారు. పనులకు అవసరమైన ఏర్పాట చేశారు. గండి పడిన చోట ప్రొక్లెయిన్లతో ఇసుక, మెటల్ మూటలను వేస్తున్నారు. గండి పూడ్చివేసే పనుల్లో వేగం పెంచారు. మరో మూడు గంటల్లో పూర్తి చేస్తామని అధికారులు వెల్లడించారు.