తిరుపతిలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. యువతి కుట్రకు యువకుడికి కత్తిపోట్లు!

-

తిరుపతిలో దారుణం జరిగింది. ఓ యువతి ఇద్దరు యువకులతో ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడిపింది. తీరా ఈ విషయం మరో యువకుడికి తెలియడంతో యువతి పాత ప్రియుడపై కొత్త ప్రియుడు కత్తితో దాడికి యత్నించాడు.కత్తి పోట్లు పడిన బాధితుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తిరుపతిలోని పీజీఆర్ థియేటర్లో శనివారం ఈ ఘటన చోటుచేసుకోగా స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం..

తన సమీప బంధువైన కార్తీక్, సహచరుడైన లోకేశ్‌తో ఆమె చనువుగా ఉంటూ ఒకరి విషయాలు మరొకరికి చెబుతూ వచ్చింది. ఈ క్రమంలోనే సినిమాకు వెళదామని చెప్పి ఇద్దరు యువకులకు ఒకే థియేటర్లో టికెట్లు బుక్ చేసింది. కార్తీక్‌కు వెనుక సీటులో టికెట్ బుక్ చేయగా.. ముందు సీటులో తనకూ, లోకేశ్‌కు టికెట్స్ బుక్ చేసింది. అప్పటికే ఈ ఇద్దరు యువకుల మధ్య మనస్పర్దల కారణంగా గొడవలు జరిగాయి. ఈ క్రమంలోనే థియేటర్లలో గొడవ జరగగా లోకేశ్.. కార్తీక్ కడుపులో కత్తితో పొడిచాడు. అనంతరం అమ్మాయిని తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో యువతి కుట్ర కోణంపై కూడా విచారణ జరుపుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news