కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉండే యువతకు ఎన్నో పథకాల ద్వారా ఉపాధి అవకాశాలను మరియు నైపుణ్యతను అందించి అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తూ వస్తోంది. వాటిలో భాగంగా ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఈ పథకం ద్వారా దేశంలో ఉండే యువతకు ఉచితంగా స్వల్పకాలిక శిక్షణను అందించడంతో పాటుగా వాటికి సంబంధించిన సర్టిఫికెట్ లను కూడా అందజేస్తున్నారు. ఈ విధంగా యువత నైపుణ్యత పెరగడంతోపాటు జీవితంలో ఎన్నో అవకాశాలు రావడానికి సహాయం చేస్తున్నారు.
అర్హత వివరాలు:
ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే వారు కనీసం 14 ఏళ్ల నుండి 35 ఏళ్ల మధ్యలో ఉండాలి మరియు కేవలం భారతదేశానికి చెందిన పౌరులు మాత్రమే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు చేసుకునే విధానం:
ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేవారు ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కు సంబంధించిన అధికారిక వెబ్సైట్ కు వెళ్లి స్కిల్ ఇండియా ఆప్షన్ పై క్లిక్ చేయాలి. తర్వాత క్యాండిడేట్ గా రిజిస్టర్ అవ్వాలి. దానిలో భాగంగా రిజిస్ట్రేషన్ ఫారం ను ఓపెన్ చేసి దానిలో అడిగిన వివరాలను పూర్తి చేసి సబ్మిట్ చేయాలి. ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ ఉపయోగించి ట్రైనింగ్ కోర్సులను పూర్తి చేయవచ్చు.
ఎటువంటి ఫీజు లేకుండా ఈ ట్రైనింగ్ కోర్సులను పూర్తి చేసి సర్టిఫికెట్లను పొందవచ్చు. దీంతో ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువగా వస్తాయి. అదే విధంగా నైపుణ్యత ఎక్కువగా ఉండడం వలన జీతాలు కూడా ఎక్కువ ఉంటాయి. ట్రైనింగ్ కోర్సులు తక్కువ రోజులకి ఉండడం వలన సమయం కూడా వృధా అవ్వదు. దీంతో ఉద్యోగ అవకాశాలను కూడా త్వరగా పొందవచ్చు. ట్రైనింగ్ లో భాగంగా కేవలం సమాచారాన్ని ఇవ్వడం మాత్రమే కాకుండా టెక్నికల్ గా కూడా శిక్షణను అందిస్తారు. దీంతో ఎంతో తక్కువ సమయంలో అభివృద్ధిని పొందవచ్చు. అదేవిధంగా శిక్షణ పూర్తి చేసిన వారికి ఆర్థిక ప్రోత్సాహాన్ని కూడా అందిచడం జరుగుతుంది.