ట్విటర్ ఉద్యోగులకు మస్క్ మరో షాక్.. మరికొంత మందిపై వేటు

-

ట్విటర్‌ ఉద్యోగులకు ఎలాన్ మస్క్ మరో షాక్ ఇచ్చారు. ఇప్పటికే సగానికి పైగా ఉద్యోగుల్ని తొలగించిన మస్క్ మరికొంత మందిని ఇంటికి పంపేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల మస్క్ జారీ చేసిన అల్టిమేటంతో దాదాపు మరో 1200 మంది రాజీనామా చేశారు. తాజాగా మరింత మందిని తొలగించేందుకు మస్క్‌ సిద్ధమవుతున్నట్లు బ్లూమ్‌బెర్గ్‌ తెలిపింది.

ట్విటర్‌లో మార్పులకు అనుగుణంగా కష్టపడి పనిచేయాలని మస్క్‌ ఇటీవల ఉద్యోగులకు సూచించారు. ఈ మేరకు లిఖితపూర్వక హామీని ఇవ్వాలని కోరారు. లేదంటే వెళ్లిపోవాలని ఇటీవల అల్టిమేటం జారీ చేశారు. దీన్ని వ్యతిరేకించిన ఉద్యోగులు చాలా మంది రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. వీరిలో చాలా మంది టెక్‌ విభాగం నుంచే ఉన్నట్లు సమాచారం. తాజాగా మస్క్‌ సేల్స్‌, పార్ట్‌నర్‌షిప్‌ విభాగం నుంచి తొలగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఈ మేరకు ఆయా విభాగాధిపతుల సమ్మతి కోరుతూ మస్క్‌ లేఖ రాసినట్లు బ్లూమ్‌బెర్గ్‌ తెలిపింది. కానీ, సేల్స్‌ విభాగాధిపతి రాబిన్‌ వీలర్‌, పార్ట్‌నర్‌షిప్స్‌ విభాగాధిపతి మ్యాగీ సునీవిక్‌.. మస్క్‌ ప్రతిపాదనను తిరస్కరించినట్లు సమాచారం. ఫలితంగా వీరివురిని మస్క్‌ ఉద్యోగం నుంచి తొలగించినట్లు కంపెనీలోని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

Read more RELATED
Recommended to you

Latest news