మనిషి మెదడులో చిప్.. ఆ వ్యాధులను జయించినట్టే?

-

మారుతున్న కాలంతో పాటే టెక్నాలజీ వినియోగం శరవేగంగా పెరుగుతోంది. ఇప్పటివరకు మనిషి చేసే పనులను సులభతరం చేయడం కోసమే టెక్నాలజీని వినియోగించగా మనిషి మెదడులోనే చిప్ పెట్టే స్థాయికి మనిషి ఎదగడం గమనార్హం. అమెరికన్ టెక్నాలజీ కంపెనీ టెస్లా అధినేత ఎలన్ మస్క్ త్వరలో మనిషి మెదడులో చిప్ ను అమర్చే టెక్నాలజీ అందుబాటులోకి రాబోతుందని తెలిపారు. ఎలన్ మస్క్ ఇప్పటికే పంది బ్రెయిన్ లో ఒక చిప్ ను అమర్చారు.

కాయిన్ సైజ్ లో ఉండే ఈ చిప్ సహాయంతో పంది ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలన్నింటికీ పరిష్కారం దొరుకుతుందని ఎలన్ తెలిపారు. దాదాపు 60 రోజుల పాటు ఎలన్ చిప్ ను పంది మెదడులో ఉంచబోతున్నారు. పందిపై చేసిన ప్రయోగాలు సక్సెస్ అయితే భవిష్యత్తులో మానవులు భాషతో సంబంధం లేకుండా చిప్ ల ద్వారా మన భావాలను అవతలి వ్యక్తులకు సులభంగా తెలియజేసే వీలు కలుగుతుంది.

ఈ చిప్ సహాయంతో మనుషులు ఎదుర్కొంటున్న అల్జీరియా, డైమెన్షియా, వెన్నముక సంబంధిత సమస్యలను సులభంగా నయం చేయవచ్చని సమాచారం. మెదడులోని పుర్రె భాగంలో చిప్ ను అమర్చి ఎలక్ట్రోడ్‌లను మెదడులోని నాడీ కణాలకు అనుసంధానం చేసి చిప్ పని చేసేలా చెస్తారు. మనిషి మెదడులో చిప్ పెట్టే ప్రయోగాలు సక్సెస్ అయితే భవిష్యత్తులో అనేక ఆరోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news