ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. ఊహించని విధంగా అక్కడ జరుగుతున్న పౌరసత్వ సవరణ ఆందోళనలు ఇప్పుడు దేశాన్ని కూడా భయపెడుతున్నాయి. గత వారం రోజులుగా పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయి. ఎప్పుడు ఎం జరుగుతుందో అర్ధం కాక అటు కేంద్రం కూడా ఇబ్బంది పడుతుంది. ఇక ఆందోళనలు క్రమంగా హింసాత్మకంగా మారుతున్నాయి.
ముఖ్యంగా సోమవారం నుంచి మంగళవారం సాయంత్రం వరకు జరిగిన ఆందోళనలు ఇప్పుడు భయపెడుతున్నాయి. చాలాచోట్ల 144వ సెక్షన్ విధించినా దాన్ని పాటించేవారే కరువయ్యారు. వీధుల్లో ముష్కరుల స్వైరవిహారం చేశారు. ఢిల్లీ ఈశాన్య ప్రాంతంలోని మౌజ్‌పూర్, చాంద్‌బాగ్, కరవల్‌నగర్, గోకుల్‌పురి, భజన్‌పురా, జఫరాబాద్‌లలో చోటు చేసుకున్న హింసలో 20 మంది మృతి చెందగా 200 మందికి పైగా గాయపడ్డారు.
హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఈశాన్య ఢిల్లీలో నేడు పాఠశాలలకు సెలకు ప్రకటించారు. ఘర్షణల్లో గాయపడ్డ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఢిల్లీ హైకోర్టు మంగళవారం రాత్రి ఆదేశాలు జారీ చేసింది. దీనితో ఇప్పుడు చాలా మంది ఢిల్లీ వెళ్ళాలి అంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ వెళ్ళాలి అనుకునే వారు జాగ్రత్తగా ఉండాలని పలువురు సూచిస్తున్నారు. అటు కేంద్రం కూడా పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది.