తెలంగాణలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది. పేద, ధనిక అనే తేడా లేకుండా స్వైరవిహారం చేస్తుంది. ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా కరోనా ను మాత్రం అరికట్టలేకపోతున్నారు. ఆ మహమ్మారికి అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ముఖ్యంగా హైదరబాద్ లో కరోనా ను కట్టడి చేయలేకపోతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కేసులు తారా స్థాయికి చేరిపోతున్నాయి. సీఎం కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ లో పనిచేస్తున్న సెక్యూరిటీ అధికారులకు కరోనా సోకిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా సీఎం కేసీఆర్ అధికారికంగా ఉండే నివాసం అయిన ప్రగతి భవన్ కు కూడా కరోనా చేరిపోయింది.
ప్రగతీ భవన్ లో పని చేస్తున్న ఐదుగురు వ్యక్తులకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ జరిగింది. లక్షణాలు కనిపించడంతో వారికి టెస్టులు చేయగా ఐదుగురికీ పాజిటివ్ రావడంతో అధికారులు కంగుతిన్నారు. వెంటనే అప్రమత్తమయిన అధికారులు వారిని ఇసోలేషన్ కు తరలించారు వారు తిరిగిన ప్రాంతాల్లో శానిటైజ్ చేశారు. వారు ఎక్కడెక్కడ తిరిగారో ఎవరితో కాంటాక్ట్ లో ఉన్నారో అధికారులు తెలుసుకుంటున్నారు. ముఖ్యమంత్రి గత నాలుగు రోజులుగా గజ్వేల్‌లోని ఆయన సొంత నివాస గృహంలో ఉంటుండడంతో ఆయనకు ముప్పు తప్పింది. ప్రగతి భవన్ ఉద్యోగులకు కరోనా సోకడం ప్రభుత్వ వర్గాల్లో కలకలం రేగింది, ఈ వార్తా బయట చెక్కర్లు కొడుతున్నా అధికారికంగా మాత్రం ప్రకటన రాలేదు.