ఇంజనీరింగ్ మ్యానేజ్మెంట్ కోటా సీట్ల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్

-

తెలంగాణా లోని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో మేనేజ్ మెంట్ కోటా సీట్ల భర్తీకి ఉన్నత విద్యా మండలి మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్రంలోని మైనార్టీ, నాన్ మైనార్టీ ప్రైవేటు అలానే అన్ ఎయిడెడ్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటాలో 30 శాతం సీట్లు ఉన్నట్టు మార్గదర్శకాలలో పేర్కొన్నారు. ఇక ఈ ప్రవేశాల ప్రకటనని అన్ని దిన పత్రికల్లో ప్రచురించాలని, ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవటానికి అనుమతించాలని మార్గదర్శకాల్లో ఉన్నత విద్యా మండలి స్పష్టం చేసింది.

ఇక అడ్మిషన్ నోటిఫికేషన్ ని ఆయా కాలేజీలు అక్టోబర్ 18వ తేదీ లోగా జారీ చేసి నవంబర్ 5 వ తేదీ లోగా ప్రవేశాల ప్రక్రియ పూర్తి చేయాలని మార్గదర్శకాల్లో ఉన్నత విద్యా మండలి స్పష్టం చేసింది. ఇక ఇప్పటికే తెలంగాణ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ కి సంబంధించి అధికారులు కొన్ని మార్పులు చేశారు. ఇంజనీరింగ్‌లో కొత్త కోర్సులు, కళాశాలల అనుబంధ గుర్తింపు ప్రక్రియ ఇంకా తేలక పోవడంతో కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌లో మార్పులు చేశారు. ఈ మేరకు టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ మొన్న ఒక ప్రకటన విడుదల చేశారు. ఇక ఈ ఆప్షన్స్ నమోదు ఈనెల 18 నుంచి 22వ తేదీ వరకు చేపట్టాలని నిర్ణయించారు.

Read more RELATED
Recommended to you

Latest news