ఈ రోజు ఇంగ్లాండ్ లోని లార్డ్స్ మైదానంలో ఏకైక టెస్ట్ ఐర్లాండ్ తో ఇవాళ మొదలైన సంగతి తెలిసిందే. ఆతిధ్య ఇంగ్లాండ్ మొదట టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా.. బదులుగా మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ కేవలం 172 పరుగులకే ఆల్ అవుట్ అయ్యి పరువు పోగొట్టుకుంది. మొదటి బంతి నుండి స్టువర్ట్ బ్రాడ్ నిప్పులు చెరిగే బంతులతో రెచ్చిపోయి 5 వికెట్లను పడగొట్టాడు. ఇతని దెబ్బకు కెప్టెన్ బల్బీర్నీ మరియు హరీ టెక్టర్ లు డక్ అవుట్ గా వెనుతిరిగారు. ఆ తర్వాత జేమ్స్ మెకోలం 36 పరుగులు, క్యాంపర్ 33 , స్టిర్లింగ్ 30 పరుగులతో జట్టును ఆదుకునే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకుండా పోయింది. ఐర్లాండ్ ను దారుణంగా దెబ్బ తీసిన బ్రాడ్ కెరీర్ లో 20 వ 5 వికెట్ హాల్ ను సాధించాడు.
పసికూనపై ఇంగ్లాండ్ బౌలర్ బ్రాడ్ ప్రతాపం… 172 పరుగులకే ఆల్ అవుట్ !
-