ఈ మధ్యన పెట్రోల్ మరియు డీజిల్ ధరలను తట్టుకోలేక సామాన్యులు ఎలక్ట్రిక్ వాహనాలపై మక్కువను చూపిస్తున్నారు. దాదాపుగా గత రెండు సంవత్సరాలుగా ఇండియాలో భారీ ఎలెక్ట్రిక్ వాహనాలు ఉత్పత్తి మరియు అమ్మకాలు జరిగినట్లుగా తెలుస్తోంది. దీనితో రోజు రోజుకి ఎలెక్ట్రిక్ వాహనాల డిమాండ్ పెరుగుతూ పోతోంది. అయితే తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ ఎలెక్ట్రిక్ వాహనాల ధరలు భారీగా పెరిగాయి. కానీ ఎందువలన పెరిగాయన్న లాజిక్ మాత్రం చాలామందికి తెలిసి ఉండదు. నిన్నటి వరకు కేంద్ర ప్రభుత్వం ఈ వాహనాలను కొనుగోలు చేస్తే 40 శాతం సబ్సిడీ ఇచ్చేది.