అహ్మదాబాద్‌లో ఇటీవలే జరిగిన చివరి టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై భారత్ ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం విదితమే. మ్యాచ్‌లో ముందుగా ఇంగ్లండ్ 205 పరుగులు చేయగా భారత్ 365 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 160 పరుగుల ఆధిక్యాన్ని దాటలేకపోయింది. దీంతో భారత్ పై ఓటమి పాలైంది.
అయితే 4వ టెస్టు మ్యాచ్ సందర్భంగా ఇంగ్లండ్ ఆటగాళ్లు బరువు తగ్గారు. ఈ విషయాన్ని ఆ జట్టు ప్లేయర్ బెన్ స్టోక్స్ స్వయంగా వెల్లడించాడు. 41 డిగ్రీల ఉష్ణోగ్రతలో మేం మ్యాచ్ ఆడాం. దాని వల్ల నేను 5కేజీలు తగ్గాను. డామ్ సిబ్లీ 4కిలోలు, జిమ్మీ ఆండర్సన్ 3కిలోలు తగ్గారు. జాక్ లీచ్ అయితే ఓ వైపు బౌలింగ్ చేయడం మరొక వైపు టాయిలెట్‌కు పరుగెత్తడం సరిపోయింది.. అని స్టోక్స్ అన్నాడు.
సహజంగానే భారత్‌లో ఈ సమయంలో ఎండలు అధికంగా ఉంటాయి. అందులోనూ టెస్టు మ్యాచ్ కనుక పగలు మొత్తం అధిక ఉష్ణోగ్రతల నడుమ మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. దీంతో సహజంగానే బరువు తగ్గుతారు. అయితే భారత్ ప్లేయర్లకు ఇలాంటి ఉష్ణోగ్రతలు అలవాటే. కానీ విదేశీ ప్లేయర్లకు ఈ వాతావరణం పడదు. అందుకనే వారు బరువు తగ్గినట్లు తెలుస్తుంది. ఇక మ్యాచ్‌లో పంత్ ఆడిన ఇన్నింగ్స్‌కు స్టోక్స్ కితాబిచ్చాడు. పంత్ అద్భుతమైన ప్రదర్శన చేశాడని స్టోక్స్ పేర్కొన్నాడు.