నేడే ఇంగ్లాండ్‌ తో టీమిండియా 5వ టెస్ట్‌..కెప్టెన్‌ గా బుమ్రా

-

ఇంగ్లాండ్‌ తో ఐదు టెస్టుల సిరీస్‌ ఫలితాన్ని నిర్ణయించే కీలక పోరుకు రంగం సిద్ధమైంది. ఎడ్జ్‌ బాస్టన్‌ వేదికగా ఇండియా వర్సెస్‌ ఇంగ్లాండ్‌ మధ్య ఐదో టెస్ట్‌ ఇవాళ ఆరంభం కానుంది. ఈ కీలక పోరులోనూ గెలుపొంది గతడాది 2-1 తో నిలిచిన ఆధిక్యాన్ని 3-1 గా మార్చి సిరీస్‌ కైవసం చేసుకోవాలని.. ఇంగ్లీష్‌ గడ్డపై చారిత్రక విజయం నమోదు చేయాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. ఇక ఈ మ్యాచ్‌ లో టీమిండియాకు రోహిత్‌ శర్మ స్థానంలో కెప్టె న్‌ గా బుమ్రా వ్యవహరించనున్నాడు. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది.  ఇక జట్ల వివరాల్లోకి వెళితే…

ఇంగ్లాండ్‌ : అలెక్స్ లీస్, జాక్ క్రాలే, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్(సి), సామ్ బిల్లింగ్స్(w), మాథ్యూ పాట్స్, స్టువర్ట్ బ్రాడ్, జాక్ లీచ్, జేమ్స్ ఆండర్సన్

టీమిండియా : శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, హనుమ విహారి, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా (సి), మహ్మద్ సిరాజ్

Read more RELATED
Recommended to you

Exit mobile version