శ్రీవారి భక్తులకు షాక్‌.. తిరుమల, తిరుపతి మధ్య పెరగనున్న ఆర్టీసీ ఛార్జీలు

-

శ్రీవారి భక్తులకు షాక్‌ తగిలింది. తిరుమల, తిరుపతి మధ్య పెరగనున్నాయి ఆర్టీసీ ఛార్జీలు. ఇవాళ్టి నుంచి తిరుమల….తిరుపతి మధ్య ఆర్టిసి ఛార్జీలు పెరగనున్నాయి. తిరుమల, తిరుపతి మధ్య ఆర్టీసీ చార్జీలను 75 నుంచి 90 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. తిరుమల, తిరుపతి మధ్య రానుపోను ఛార్జీలను 135 నుంచి 160 రూపాయలకు పెంచింది.

అటు డీజిల్ సెస్ పెంపుతో ఇవాళ్టి నుంచి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్ ఛార్జీలు… భారీగా పెరగనున్నాయి. డీజిల్ సెస్ తో పాటు కనీస ఛార్జీలను పెంచిన ఆర్టీసీ…. ప్రయాణ దూరాన్ని బట్టి కనిష్టంగా రూ.10 గరిష్టంగా రూ.140 పైన డీజిల్ సెస్ వసూలు చేయనుంది. బేసిక్ ఛార్జీ, డీజిల్ సెస్ కలిపి కిలోమీటర్ల ప్రతిపాదికన మొత్తం చార్జీని నిర్ణయించిన ఆర్టీసీ… పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు మినహా అన్ని బస్సుల్లో కనీస చార్జీలు పెంచింది. పల్లెవెలుగు,ఆల్ట్రా పల్లెవెలుగు బస్సుల్లో కనీస చార్జీ రూ.10 యథాతథంగా ఉంచింది ఆర్టీసీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version