PF ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పింది ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ EPFO. తాజాగా ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. దీనితో కంపెనీలకు ఊరట కలిగింది.
ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. ఎలక్ట్రానిక్ చలాన్ కమ్ రిటర్న్స్ ECR ఫైలింగ్ కి సంబంధించి యూనివర్సల్ అకౌంట్ నెంబర్ UANతో ఆధార్ నెంబర్ లింక్ గడువును పొడిగించింది.
దీనితో ఇది భారీ ఊరటని ఇచ్చింది అనే చెప్పాలి. ఈపీఎఫ్‌వో ఈ గడువును 2021 సెప్టెంబర్ 1 వరకు పొడిగించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుత నిబంధనల ప్రకారం ఈసీఆర్ దాఖలు చేయడానికి కచ్చితంగా యూఏఎన్ నెంబర్‌తో ఆధార్ నెంబర్‌ను లింక్ చేసుకోవాల్సి ఉంది.
జూన్ 1 నుంచి ఈ కొత్త రూల్స్ అమలు లోకి రావడం జరిగింది. ఈపీఎఫ్‌వో ఇప్పుడు ఈ రూల్ అమలును సెప్టెంబర్ 1 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో యూఏఎన్‌తో ఆధార్ లింక్ కాకపోయినా కూడా ఇప్పుడు ఈసీఆర్ దాఖలు చేయవచ్చు.