ఆధార్ నెంబర్‌కు మొబైల్ నెంబర్ లింక్ తప్పనిసరి… ఎందుకంటే…?

-

ఇది వరకు అంత అవసరం లేకపోయింది కానీ ఇప్పుడు ప్రతీ ఒక్కరి ఆధార్ నెంబర్‌కు మొబైల్ నెంబర్ లింక్ తప్పనిసరి చేయడం జరిగింది. అయితే ఎందుకు ఆధార్ నెంబర్‌కు మొబైల్ నెంబర్ లింక్ తప్పనిసరి..?, దీని వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి..?, లింక్ చేయకపోతే ఏమవుతుంది..? వీటి కోసం ఇప్పుడే డీటెయిల్ గా తెలుసుకోండి. ఆధార్ నెంబర్‌కు మొబైల్ నెంబర్ లింక్ తప్పనిసరి చేసారు అన్నది తెలిసినదే. గతం లో ఎవరైనా ఆధార్ నెంబర్‌కు మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవాలంటే ఫిజికల్ గా ప్రూఫ్స్ కూడా పట్టుకుని వెళ్లాల్సి వచ్చేది.

కానీ ఇప్పుడు అంత కష్టపడక్కర్లేదు. ఎంతో సులభంగా మీ ఆధార్ కార్డుకు మొబైల్ నంబర్‌ను లింక్ చేయవచ్చు. ఇంకా మీరు మీ ఆధార్ నెంబర్‌కు మొబైల్ నెంబర్ లింక్ చేసుకోనట్టు అయితే… మీ సమీపం లోని ఆధార్ కేంద్రాన్ని సందర్శించి మీ ఆధార్ కార్డులో వివరాలను అప్‌డేట్ చేయవచ్చు. మీరు ఆధార్ నెంబర్‌కు మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవడానికి మొబైల్ నెంబర్ లింక్ కోసం ఫోటో, బయోమెట్రిక్ వంటివి ఏమి అవసరం లేదు అని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ట్వీట్‌ చేసి ఈ సమాచారాన్ని ఇచ్చింది.

మీ మొబైల్ నంబర్ను UIDAIలో నమోదు చేసుకుంటే….ఆన్‌లైన్ ద్వారా సులభంగా అనేక సేవలను పొందొచ్చు. అలానే ఈ-ఆధార్ కాపీని సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అంతే కాదండి కొత్తగా ఆధార్ నమోదు, పేరులో తప్పులుంటే సవరణ చేయడం, అడ్రస్ అప్డేట్ వగైర పర్సనల్ విషయాలని అప్డేట్ వంటి సేవలని పొందవచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news