ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ శుభవార్త..!

-

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా
సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చేసింది. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే.. పోర్టల్‌ లో ప్రత్యేక ఆప్షన్‌ను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తీసుకు వచ్చింది.

ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలను ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పోర్టల్‌ లో ఒక నిబంధనను రూపొందించింది. రిటైర్డ్ ఉద్యోగులు అధిక పెన్షన్‌ను సెలెక్ట్ చేసుకో వచ్చు. దీనికి అనుగుణంగా EPFO యజమానుల తో ఉమ్మడి ఎంపికల ధ్రువీకరణ కోసం దరఖాస్తు ఫారం కోసం ఉద్యోగుల నుండి రిజిస్ట్రేషన్ అభ్యర్థనలను తీసుకోవడం మొదలు పెట్టింది.

సెప్టెంబర్ 1, 2014కి ముందు రిటైర్ అయిన వాళ్ళు పెన్షన్ స్కీమ్ (EPS) లోని పారా 11(3) ప్రకారం ఉమ్మడి ఎంపికను కూడా ఉపయోగించాలి. దరఖాస్తు ఫారమ్‌ లో పెన్షన్ చెల్లింపు ఆర్డర్, ఆధార్ నంబర్, పేరు, పుట్టిన తేదీని ఎంటర్ చెయ్యాలి.  EPFO రికార్డుల ప్రకారం ఇది ఉండాలి. UIDAI రికార్డుల ప్రకారం సభ్యునికి చెల్లుబాటు అయ్యే మొబైల్ నంబర్ లింక్ అయ్యి ఉండాలి. అయితే వెబ్‌సైట్ సరిగ్గా పని చేయలేదు. దీనితో మళ్ళీ మార్పులు చేసింది. ఈ ఫీచర్ ఇప్పుడు సరిగ్గా పని చెయ్యడం లేనందుకే ఇంకో ఫీచర్ ని తీసుకు రావచ్చు. అలానే ఈపీఎఫ్‌వో పీఎఫ్ పాస్ బుక్ చెకింగ్ సర్వీసులు ని కూడా తీసుకు వచ్చింది.

 

Read more RELATED
Recommended to you

Latest news