పీఎఫ్ చందాదారులకు అలర్ట్…!

-

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) కొత్త సర్క్యూలర్ ని జారీ చేసింది. అధిక పెన్షన్‌కు సంబంధించి ఈ సర్క్యులర్ ని తీసుకొచ్చింది. ఉమ్మడి ఆప్షన్ దరఖాస్తుల పరిశీలనకు మార్గదర్శకాలు తీసుకొచ్చింది. పెన్షనర్లు చేసిన దరఖాస్తుల పరిష్కారం కోసం కేంద్ర సర్వర్ నుంచి కంపెనీల యాజమాన్యాల లాగిన్‌ లోకి పంపించింది ఈపీఎఫ్ఓ. పెన్షనర్లు తాము సర్వీసులో వున్నప్పుడు సెప్టెంబర్ 1, 2014కి ముందు పదవీ విరమణ చేసిన వాళ్ళు ఉమ్మడి ఆప్షన్లు ఇచ్చినా కూడా రిజెక్ట్ చేసింది. వాళ్లకి ఇప్పుడు మే 3 వరకు ఛాన్స్ ఇచ్చింది. 2014 కన్నా ముందు ఉద్యోగంలో చేరి సర్వీసులో కొనసాగుతూ అధిక వేతనంపై అధిక ఈపీఎఫ్ చందా చెల్లించిన ఉద్యోగులు కోసం మే 3 వరకు ఉమ్మడి ఆప్షన్ కోసం అవకాశాన్ని ఇస్తోంది.

ఇదిలా ఉండగా దరఖాస్తుల పరిశీలన, అర్హత, అవసరమైన డాక్యుమెంట్లు వంటి వాటిని వివరిస్తూ ఏప్రిల్ 23న కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. యాజమాన్యాల లాగిన్‌ లోకి వచ్చిన ఉమ్మడి ఆప్షన్ దరఖాస్తుల్ని ఆమోదించి.. అదే కాకుండా డాక్యుమెంట్లు, శాలరీ వివరాలను ఇవ్వాలి. యాజమాన్యాల ఆమోదం అయ్యాక చట్టం 1952 ప్రకారం అధిక వేతనంపై ఈపీఎఫ్ చందా చెల్లించడం పరిపాలన ఛార్జీలు చెల్లించేందుకు ఉమ్మడి ఆప్షన్లు పరిశీలించాలి. సరైన పత్రాలు ఇస్తే ప్రాంతీయ పీఎఫ్ అధికారికి పంపిస్తారు. ప్రత్యేక నంబర్, కేటగిరీ, సంస్థ పేరు నమోదు చేసాక దరఖాస్తు స్టేటస్ ని తెలుసుకుంటారు. డాక్యుమెంట్లు అన్నీ సరిగ్గా ఉండాలి. ఒకవేళ యాజమాన్యాలు వాటిని ఆమోదించకపోతే ఈపీఎఫ్ఓ క్షేత్రస్థాయి అధికారి వాటిని సంబంధిత సెక్షన్ అధికారికి పంపిస్తారు.

క్రోడీకరించి ప్రాంతీయ పీఎఫ్ అధికారికి ఇస్తారు. యాజమాన్యాలు ఆమోదించకాపోతే ఉమ్మడి ఆప్షన్లు తిరస్కరిస్తున్నట్లు చందాదారులు, పింఛనుదారులకు సమాచారం ఇస్తారు. పొరపాట్లు సరిదిద్దేందుకు నెల రోజుల సమయం ఇస్తారు. పత్రాలు లేకున్నా, దరఖాస్తులో తప్పులున్నా అదనపు సమాచారం కోసం క్షేత్రస్థాయి సహాయకుడు వివరాలు ఎంటర్ చేస్తారు. యాజమాన్యాలు నెల రోజుల్లోగా వివరాలని ఇవ్వాలని ప్రాంతీయ పీఎఫ్ అధికారులు నోటీసులు జారీ చేస్తారు. వాటిని ఉద్యోగులు, పెన్షనర్లకు ఈపీఎఫ్ఓ తెలియజేస్తుంది. నెల రోజుల్లోగా ఇచ్చేస్తే పరిశీలిస్తారు. లేదంటే సహాయ, ప్రాంతీయ పీఎఫ్ అధికారి విచక్షణ మేరకు ఆదేశాలు జారీ చేస్తారు.

 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version