ఢిల్లీలో ఉన్న ఎర్రకోట తనదే అని ఒక మహిళ ఢిల్లీ హై కోర్టులో పిటిషన్ దఖాలు చేసింది. తను మొఘలుల చివరి రాజు బహదూర్ షా మునిమనవడు మీర్జా మహ్మద్ బీదర్ భక్త్ భార్యనని తన పేరు సుల్తానా బేగం అని చెప్పింది. తనకు పరిహారం లేదా ఎర్రకోట ఎదో ఒకటి ఇప్పించాలని కోర్టు లో పిటిషన్ దఖాలు చేసింది. తన భర్త చనిపోయిన తర్వాత నుంచి ప్రభుత్వం ఇస్తున్నపెన్షన్ సరిపోవడం లేదని.. పరిహారం చెల్లించాలని కోరింది. లేదా ఎర్ర కోట ను అప్పగించి నష్ట పరిహారం చెల్లించాలని హై కోర్టు ను కోరింది. కాగ హై కోర్టు పిటిషనర్ షాక్ ఇచ్చింది.
ఈ పిటిషన్ ను జస్టిస్ రేఖా పల్లీ ధర్మాసనం కొట్టివేసింది. ఎర్ర కోట నీదే అయితే ఇప్పటి వరకు ఏం చేశారంటూ ప్రశ్నించింది. దీని పై సుల్తానా బేగం తరపున న్యాయవాది స్పందిస్తూ.. తన క్లయింట్ కు చదువు రాదని తనకు ఇప్పటి వరకు ఏం తెలియదని అందుకే ఇప్పటి వరకు కోర్టు ను ఆశ్రయించలేదని తెలిపారు. కాగ వీరి సమాధానం అంగీకరించేలా లేదని అలాగే ఆమోదయోగ్యం కాదని ఈ పిటిషన్ హై కోర్టు కొట్టివేసింది.