గణేష్ మండపాలకు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గణేశుడి మండపాల వద్ద సాయంత్రం 6 నుంచి 10 గంటల వరకే సౌండ్ సిస్టమ్ అనుమతించాలని హైకోర్టు సూచించింది. సౌండ్ డిసిబుల్ స్థాయి దాటకుండా చెకింగ్ మీటర్లతో పర్యవేక్షించాలని సూచించారు. పాఠశాలలు, ఆస్పత్రులు, వృద్ధాశ్రమాల వైపు స్పీకర్లు పెట్టకూడదని, నిర్వాహకులు నిబంధనలను తప్పకుండా పాటించాలని స్పష్టం చేశారు. ప్రజల విజ్ఞప్తులు, సమస్యలను దృష్టిలో పెట్టుకొని విగ్రహాల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని అధికారులకు, పోలీసులకు హైకోర్టు సూచనలు జారీ చేసింది.
ఎవరైనా నిబంధనలను అతిక్రమించినట్లయితే సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తే విధంగా ప్రవర్తించినట్లయితే పోలీసులు వారిపై తప్పకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కాగా నేటి నుంచి ఈ విధానం అమలులోకి వస్తుందని అధికారులు పేర్కొన్నారు. ప్రజలు ఎవరికి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. నిబంధనలను అతిక్రమించినట్లయితే కఠినమైన చర్యలు తీసుకుంటామని అధికారులు, పోలీసులు పేర్కొన్నారు.