ఏపీలో 15 చోట్ల హెల్త్ సిటీల ఏర్పాటు : జగన్ సర్కార్ ప్రతిపాదనలు

-

అమరావతి : ఏపీలో హెల్త్ సిటీల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం జగన్ సర్కార్ చేసింది. రాష్ట్రంలో 15 చోట్ల హెల్త్ సిటీలను ఏర్పాటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం కీలక ప్రతిపాదనలు చేసింది. హెల్త్ సిటీల కోసం స్థలాలను గుర్తించిన వైద్యారోగ్యశాఖ… తూ.గో, కృష్ణాలో రెండు.. మిగిలిన జిల్లాల్లో ఒక్కో హెల్త్ సిటీ నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తిరుపతి హెల్త్ సిటీ కోసం స్థలాన్ని గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. ఒక్కో చోటా 30 ఎకరాల్లో హెల్త్ సిటీలను నిర్మించాలని ప్రతిపాదించిన వైద్యారోగ్యశాఖ…. అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములతో పాటు కొన్ని చోట్ల ప్రైవేటు భూములనూ కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుంది ఏపీ సర్కార్‌. మొత్తంగా ప్రైవేటు భూముల కోనుగోళ్లకు రూ. 200 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసింది ప్రభుత్వం.

ఇది ఇలా ఉండగా… జిల్లా కలెక్టర్లు పర్యవేక్షణలో ఉన్న ఆరోగ్యపరమైన అంశాలను జేసీలకు బదలాయింపు చేసింది సర్కార్‌. వైద్యారోగ్యశాఖకు సంబంధించిన వివిధ అంశాలను గ్రామ, వార్డు సచివాలయాల బాధ్యతల్ని పర్యవేక్షిస్తున్న జేసీలకు అప్పగించింది ఏపీ ప్రభుత్వం. లింగవివక్ష నియంత్రణా చట్టం, క్లినికల్ ఎస్టాబ్లిష్ మెంట్ చట్టం, ఆహార కల్తీ నియంత్రణ వ్యవహారాలు, జాతీయ ఆరోగ్య మిషన్ కార్యక్రమాల పర్యవేక్షణ, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్కుల ఏర్పాటు , పర్యవేక్షణ లాంటి బాధ్యతల్ని జేసీలకు అప్పగించింది. వీటితో పాటు జిల్లాల్లో ఆరోగ్యశ్రీ కార్యక్రమాల పర్యవేక్షణ, పల్స్ పోలియో లాంటి జాతీయ ఆరోగ్య కార్యక్రమాల బాధ్యత ఇక జేసీలదేనని ఉత్తర్వుల్లో పేర్కోంది ఏపీ ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Latest news