తెలంగాణ రాష్ట్ర కేబినెట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్తగా యూనివర్సిటీలను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో ప్రభుత్వం రాష్ట్రంలో అటవీ, మహిళా యూనివర్సిటీలను ఏర్పాటు చేయనుంది. అలాగే అటవీ శాఖా ఉద్యోగాల్లో రిజర్వేషన్లను కూడా కల్పించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. డిగ్రీలో ఫారెస్ట్రీ కోర్సు చేసిన విద్యార్థులకు రిజర్వేషన్లు ఉండనున్నాయి.
అందులో భాగంగా అటవీ శాఖలోని అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఉద్యోగాల్లో 25 శాతం రిజర్వేషన్లు ఉండనున్నాయి. అలాగే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాల్లో కూడా 50 శాతం రిజర్వేషన్లను ప్రభుత్వం ఇవ్వనుంది. కాగ రాష్ట్ర కేబినెట్ ఈ రోజు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి అధ్యక్షతన సమావేశం అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే వచ్చే ఏడాది నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం విద్య ప్రవేశ పెట్టాలని నిర్ణయం తీసుకుంది.