రాష్ట్రంలో భ‌యాందోళ‌నగా క‌రోనా వ్యాప్తి.. నేడు 2,447 కేసులు

-

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి భ‌యాందోళ‌న ప‌రిస్థితులలో ఉంది. రోజు రోజుకు క‌రోనా వ్యాప్తి పెరుగుతుంది. ఆదివారం తో పోలిస్తే.. రాష్ట్రంలో చాలా వ‌ర‌కు క‌రోనా కేసులు పెరుగాయి. నేటి క‌రోనా బులిటెన్ ను కాసేప‌టి క్రితం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్ల‌డించారు. నేటి క‌రోనా బులిటెన్ ప్ర‌కారం తెలంగాణ రాష్ట్రంలో 2,447 క‌రోనా కేసులు వెలుగు చూశాయి. ఆదివారం రాష్ట్రంలో 2,047 కేసులు న‌మోదు అయ్యాయి.

అంటే ఆదివారం తో పోలిస్తే.. నేడే దాదాపు 400 కరోనా వైర‌స్ కేసులు పెరిగాయి. అలాగే రాష్ట్రంలో గ‌డిచిన 24 గంట‌ల‌లో కరోనా కాటుకు ముగ్గురు మ‌ర‌ణించారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా క‌రోనా నుంచి ఈ రోజు 2,295 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 22,197 క‌రోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే నేడు రాష్ట్ర వ్యాప్తంగా 80,138 కరోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. కాగ రాష్ట్రంలో క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష సంఖ్య పెరిగినా.. పాజిటివ్ కేసుల సంఖ్య కొంత వ‌ర‌కే పెరిగింది అని చెప్ప‌వ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Latest news