కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. కోట్లాదిమంది ఈ వైరస్‌బారిన పడ్డారు. అయితే కరోనా బారిన మహిళల కన్నా పురుషులే ఎక్కువగా పడుతున్నారట. కరోనా ముప్పు పురుషులకే ఎక్కువగా ఉన్నట్లు గణాంకాలు కూడా చెబుతున్నాయి. అయితే.. ఈ విషయంపై అధ్యయనం చేసిన అమెరికాలోని వేక్ ఫారెస్ట్ బాప్టిస్ట్ మెడికల్ సెంటర్‌కి చెందిన శాస్త్రవేత్తలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
మహిళల్లో సెక్స్ హార్మోన్ ఈస్ట్రోజన్ వల్ల వైరస్ సోకే ముప్పు తక్కువగా ఉందని వారి పరిశోధనలో తేలింది. వైరస్ సోకితే గుండె మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. అయితే.. మహిళల్లో ఉత్పత్తి అయ్యే ఈస్ట్రోజన్ గుండె సంబంధిత సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది. కరోనా ప్రభావం నేరుగా గుండెపై పడకుండా ఈస్ట్రోజ న్ అడ్డుపడుతుందని, దీంతో వైరస్ సోకినా మహి ళల్లో ముప్పు తక్కువగా ఉంటోందని ప్రొఫెసర్ లియాన్నె గ్రోబన్ చెప్పారు.