ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలు సంస్థలు ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాక్సిన్ అభివృద్ధి చేసి శరవేగంగా క్లినికల్ ట్రయల్స్ జరుపుతున్న క్రమంలోనే ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజనికా సంయుక్తంగా ఒక వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్నాయి. వ్యాక్సిన్ సామర్థ్యంపై ఎప్పటికప్పుడు ఆస్ట్రాజనికా ప్రజలందరికీ తెలుపుతూనే వుంది అన్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఆస్ట్రాజనికా వ్యాక్సిన్ పై కీలక ప్రకటన చేసింది.
ప్రస్తుతం ఆస్ట్రాజనికా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ సామర్ధ్యం 70% అంటూ తెలిపింది… క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను విశ్లేషించిన తర్వాత ఈ విషయాన్ని వెల్లడించినట్లు ఆస్ట్రాజనికా తెలిపింది. క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా మొదటి దశలో మొదట వాలంటీర్లకు సగం డోస్ ఇచ్చి కొన్ని రోజుల్లో పూర్తి లో ఇచ్చిన తర్వాత 90% సత్ఫలితాలు వచ్చినట్లు తెలిపింది ఆస్ట్రాజనికా.. ఇక రెండవ క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా 62 శాతం సత్ఫలితాలు ఇచ్చినట్లు తెలిపింది.