హరీష్ రావుపై ఈటల సంచలన వ్యాఖ్యలు…ఇక నీకు నా గతే !

-

కమలాపూర్ బీజేపీ నాయకుల, కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కమలాపూర్ గడ్డ చైతన్యమైన గడ్డ అని… కమలాపూర్ కి తొలిసారిగా వచ్చినప్పుడు అపూర్వ స్వాగతం పలికిన గడ్డ అని పేర్కొన్నారు. ” మంత్రి హరీష్ రావు ఇక్కడి మందిని తీసుకు పోవాలి… దావత్ ఇయ్యాలే, డబ్బులు ఇయ్యాలే ఇదే పని ఆయనది…సీఎం కేసీఆర్‌ మెప్పు పొందాలనే హరీష్ రావు చూస్తున్నాడు…మెప్పు పొందాలేవు…నీకు నా గతే పడుతుంది” అంటూ మంత్రి హరీష్‌ పై సంచలన వ్యాఖ్యలు చేశారు ఈటల.

ఇతర పార్టీల నుండి ఎమ్మెల్యేలను తీసుకవచ్చి మంత్రులను చేసిన ఘనతే కేసిఆర్ దే.. నీ పార్టీ లో గెలిచిన అన్నారుగా…అందుకే రాజీనామా చేసి వచ్చానని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు హుజురాబాద్ వైపు చూస్తున్నారని…కొంతమంది మంత్రులతో, ఎమ్మెల్యేలతో నాపై అవాకులు చేవాకులుగా మెరిపిస్తున్నారని మండిపడ్డారు.

తాను వరంగల్ మున్సిపల్ ఎలక్షన్స్ ప్రచారంలో ఉండగానే….కేసీఆర్ కుట్రలు చేశాడని… వాళ్ళ అబద్ధాల పత్రిక, అబద్దాల ఛానల్ లో పదే పదే అబద్ధాలు చెప్పారని ఫైర్‌ అయ్యారు. ఆ వార్తలు చూసిన ప్రతి తెలంగాణ బిడ్డ కన్నీరు పెట్టారని….ఇక్కడ ఉన్న స్థానిక ప్రజా ప్రతినిధులు ఒక్కరూ అడగాలే మా ఈటలన్న ఏమీ తప్పు చేశాడని తెలిపారు. హుజూరాబాద్ చైతన్యవంతమైన గడ్డ అని.. ప్రాణాన్ని లెక్కచేయకుండా పోరాటం చేసిన గడ్డ హుజురాబాద్‌ అని పేర్కొన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా.. విజయం బీజేపీదేన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news