తెలంగాణా బిజెపిలో రాజుకున్న ఈటెల చిచ్చు… !

ఈటల రాజేందర్ బీజేపీలోకి వస్తున్నాడన్న వార్తలతో అసంతృప్తి వ్యక్తం చేసారు మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లొ హుజూరాబాద్ నుంచి పోటీచేసేది నేనే అని స్పష్టం చేసారు. అధ్యక్షుడు బండి సంజయ్ ఆదేశాల ప్రకారమే హుజూరాబాద్ లో పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్న అని తెలిపారు. ఈటల రాకపై నాతో మాట మాత్రం చెప్పరా? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు.

పార్టీలో ఒక్క వర్గం మాత్రమే ఈటలకు మద్దతుగా మాట్లాడుతున్నారు అని ఈటలతో సంప్రదింపులు జరిపిన సమయంలో ఒక్కసారి కూడా నన్ను అడగకపోవడం శోచనీయం అని విస్మయం వ్యక్తం చేసారు. ఢిల్లీ నుండి స్పెషల్ ఫ్లయిట్ లో వచ్చిన నాయకులకు నాకు చెప్పడానికి బాధ ఏంటి? అని నిలదీశారు. స్థానిక ప్రతినిధినైన నన్ను సంప్రదించకపోవటం బాధాకరమన్నారు. ఈటలతో బీజేపీ బలోపేతం అవుతోందంటే ఆయన రాకను స్వాగతిస్తానని తెలిపారు.